Indiramma Indlu: తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు శుభవార్త అందనున్నది. ఇప్పటికే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నవారు ఇక ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది. రెండో విడత ఎంపికైన లబ్ధిదారుల జాబితాను వెల్లడించనున్నారు. ఈ మేరకు మే 12 నుంచి ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత 2.05 లక్షల మందిని ఎంపిక చేసినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఎంపికైన వారందరికీ మే 12 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. ఇదిలా ఉండగా, గ్రామాల్లో తమకు ఇండ్లు మంజూరు కాలేదంటూ ఎందరో నిరుపేదలు లబోదిబోమంటున్నారు.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలిదశలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71 వేల మందికి ఇండ్లను మంజూరు చేశారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తిచేసిన వారందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో తొలి విడత నిధులను జమచేశారు. పనుల వివరాలను బట్టి వారి ఖాతాల్లో ప్రతి సోమవారం నిధులను జమ చేయనున్నారు.
