Asaduddin owaisi: పాకిస్థాన్‌ అబద్ధపు ప్రచారాన్ని ఇస్లాం సమర్థించదు

Asaduddin owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇస్లాం మతం అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. పవిత్ర రమజాన్‌ మాసంలో పాక్ అమానుష చర్యలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో అబద్ధపు ప్రచారం చేస్తూ హింసను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు ఆ మతపేరును ఉపయోగించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే పాక్ దాడులకు మించి భారత్ సమర్థవంతంగా ప్రతిదాడులు చేస్తుందని చెప్పారు. “దేవుడి దయతో మనం భారతభూమిపై జన్మించాం. ఈ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం” అని గర్వంగా తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *