Operation Sindoor: వీరతిలకం దిద్ది యుద్ధ రంగానికి తమ భర్తలను పంపేవారని పలనాడు, కాకతీయ రాజుల చరిత్రలో మనం చదువుకున్నాం. ఈ నాడు మన దేశానికి పాకిస్థాన్ రణరంగంలో ఉండగా, సైనికుల భార్యలు తమ భర్తలకు వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Operation Sindoor: మహారాష్ట్రలో ప్రత్యేకత ఏమిటంటే.. పెళ్లయి మూడు రోజులు కాకమునుపే యుద్ధానికి సిద్ధం చేసి పంపింది ఆ నవవధువు. కాళ్లపారాణి ఆరకముందే రణరంగంలోకి సాగనంపింది. వీరతిలకం దిద్ది విజేయుడై తిరిగి రావాలని కోరుకున్నది. దేశం తరఫున పోరాడి జాతికి మేలు చేసి, దేశం గర్వించేలా తిరిగిరావాలని ఆశించింది. ఆ సమయంలో ఆమె చెప్పిన విషయం దేశం యావత్తు పులకించేలా ఉండటం విశేషం.

Operation Sindoor: మహారాష్ట్రకు చెందిన ఆర్మీ జవాన్ మనోజ్ పాటిల్ పెళ్లి కోసం సెలవులు పెట్టుకున్నాడు. ఈ లోగా మేనెల 5న వివాహం జరిగింది. కాళ్లపారాణి ఆరనేలేదు. బంధువులు ఇండ్లకు వెళ్లనేలేదు. పెళ్లి కళ ఇంకా అలాగే ఉన్నది. నవ వధువుల సంతోషంతో ఆ ఇల్లు కళకళలాడుతున్నది. ఈ లోగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పెళ్లయిన మూడోరోజే సెలవులు రద్దు చేస్తూ, యుద్ధానికి సిద్ధమై రావాలంటూ ఆర్మీ అధికారుల నుంచి మనోజ్ పాటిల్‌కు ఆదేశాలు రానేవచ్చాయి.
Operation Sindoor: ఈ మేరకు దేశ రక్షణలో భాగం కావాలని మనోజ్ పాటిల్ సిద్ధమై, భార్యకు వీడ్కోలు పలుకుతూ బయలుదేరి వెళ్లాడు. నవ వధువైన అతని భార్య యామిని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లియన నాలుగోనాడే బార్డర్‌కు వెళ్తుండటంతో ఆవేదనకు లోనయ్యారు.
Operation Sindoor: ఈ సందర్భంగా మనోజ్ పాటిల్ యుద్ధరంగంలో వెళ్తుండగా, ఆయన భార్య యామిని అక్కడి మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సమాధానంతో దేశ ప్రజలకే స్ఫూర్తినిచ్చేలా ఉన్నది. నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా.. అంటూ కన్నీటితో తన భర్తను పంపింది.
