Sachin Vananjay:

Sachin Vananjay: పాక్ కాల్పుల్లో మ‌రో జ‌వాన్ వీర‌మ‌ర‌ణం

Sachin Vananjay: భార‌త్‌, పాక్ ఉద్రిక్త‌త‌ల న‌డుమ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త్ మ‌రో జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో పాక్ జ‌రిపిన కాల్పుల్లో స‌చిన్ యాద‌వ్‌రావు వ‌నాంజే (29) అసువులు బాశారు. స‌చిన్ యాద‌వ్‌రావుది మ‌హారాష్ట్ర‌-తెలంగాణ రాష్ట్రాల స‌రిహ‌ద్దులోని నాందేడ్ జిల్లా త‌మ్లూర్ గ్రామం. ఈ రోజే (మే 10) ఆయ‌న పార్థీవ‌దేహాన్ని స్వ‌గ్రామానికి త‌ర‌లించనున్నారు.

Sachin Vananjay: స‌చిన్ యాద‌వ్‌రావు వ‌నాంజే మ‌ర‌ణంతో త‌మ్లూరు గ్రామంతోపాటు ప‌రిస‌ర గ్రామాల్లో విషాదం అలుముకున్న‌ది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు తీవ్ర దుఃఖసాగ‌రంలో మునిగిపోయారు. వారి బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంతోపాటు రాష్ట్రంలో స‌చిన్ యాద‌వ్‌రావు వ‌నాంజే మృతికి సంతాపం తెలుపుతూ బ్యాన‌ర్లు పెద్ద ఎత్తున వెలిశాయి.

Sachin Vananjay: ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ముర‌ళీనాయ‌క్ పాక్ కాల్పుల్లో వీర‌మ‌ర‌ణం పొందారు. ఆయ‌నది స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌లం క‌ల్లితండ స్వ‌గ్రామం. ఆయ‌న జ‌మ్ము క‌శ్మీర్ రాష్ట్రంలోని యురి బార్డ‌ర్‌లో విధుల్లో ఉండ‌గా, పాకిస్థాన్ జ‌రిపిన కాల్లుల్లో అసువులు బాశారు.

Sachin Vananjay: ప్ర‌స్తుతం భార‌త్ పూర్తి స్థాయి యుద్ధం చేప‌ట్ట‌క ముందే పాక్ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. క‌య్యానికి కాలు దువ్వుతూ జ‌నావాసాల‌పై విచ‌క్ష‌ణా ర‌హిత కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్న‌ది. తొలి నుంచి క్షిప‌ణులు, డ్రోన్లతో దాడుల‌కు తెగ‌బ‌డుతున్న‌ది. వాట‌న్నింటినీ భార‌త సైన్యం దీటుగా ఎదుర్కొంటున్న‌ది. ఈ ద‌శ‌లోనే ఇద్ద‌రు జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొంద‌డం వారి కుటుంబాల‌కు, దేశానికి తీర‌ని విషాదం నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *