Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్‌కు సిద్ధం చేసిన ఆయన, దర్శకుడు అనిల్ రావిపూడితో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, ఆయన మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది.ఈ సినిమాకు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్‌ను తీసుకొచ్చేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారట. మొదట రాణి ముఖర్జీ పేరు వినిపించినా, ఇప్పుడు ‘కల్కి’ ఫేమ్ దీపికా పదుకొణెను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ‘కల్కి’తో టాలీవుడ్‌లో సుపరిచితమైన దీపికా, చిరంజీవితో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ కాంబో సెట్ అయితే తెలుగు సినీ అభిమానులకు పండగే! మరి, ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

