Arijit Singh

Arijit Singh: అర్జీత్ సింగ్ రెస్టారెంట్‌తో కార్మికులకు అండ!

Arijit Singh: ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ అర్జీత్ సింగ్ తన సంగీతంతోనే కాదు, మంచి మనసుతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు! ముర్షిదాబాద్‌లోని జియాగంజ్‌లో ‘హెన్షెల్’ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు అర్జీత్. కార్మిక వర్గం కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ రెస్టారెంట్‌లో కేవలం 30 రూపాయలకే భోజనం లభిస్తుంది. ఈ సందర్భంగా అర్జీత్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వారికి తక్కువ ధరలో స్వచ్ఛమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ చొరవ తీసుకున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్‌లో అన్ని రకాల వంటకాలు లభిస్తాయని, నాణ్యతకు ఎలాంటి రాజీ లేదని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అర్జీత్ చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి. ‘అర్జీత్ సింగ్ గొప్ప గాయకుడే కాదు, గొప్ప మనసున్న మనిషి’ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ చిన్న ప్రయత్నంతో జియాగంజ్ ప్రాంతంలోని కార్మికుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అర్జీత్ సింగ్ ఈ సామాజిక సేవతో మరోసారి అందరి గుండెల్లో చోటు సంపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *