Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకం

గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.Bవిద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని ప్రసగించారు.ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదని చెప్పారు.

బాధ్యతగల ఈఆర్‌సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు.సీఎం రేవంత్‌ బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. దీపావళికి ముందే బాంబులు పెళుతాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్‌.. అయన పై జరిగిన ఈడి రైట్స్ కావచ్చని ఎద్దేవా చేశారు. ఎం చేస్తారో చేసుకోండని చెప్పారు.

ఈ చిట్టి నాయుడు ఏం చేస్తాడని, చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే అన్నారు. నిజమైన బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడతానా అని చెప్పారు.సిరిసిల్ల నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. విద్యుత్‌ చార్జీలను 5 రెట్లు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.అన్నిరకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌ను ఒకే గాటున కట్టడం కరికాదని చెప్పారు.

 

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *