Thammudu: నితిన్ హీరోగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వకీల్ సాబ్ ఫేమ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘తమ్ముడు’ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అనౌన్స్‌మెంట్ సమయంలోనే సినిమా మంచి బజ్ సృష్టించగా, రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ ఫ్యాన్స్‌ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఇప్పుడు మేకర్స్ ఆ సస్పెన్స్‌కు తెరదించి, జూలై 4న ‘తమ్ముడు’ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు దర్శకుడిపై ప్లాన్ చేసిన ఫన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రమోషన్స్‌కు జోష్ తెప్పించింది. నితిన్ యాక్షన్ అవతార్‌లో థియేటర్స్‌లో సందడి చేయనున్నారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా, దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ‘తమ్ముడు’ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద నితిన్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!