Kalvakuntla Kavitha: మే 16న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్తున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి భర్త అనిల్ తో కలిసి పయనం కానున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23న తిరిగి హైదరా బాద్ చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు ఢి ల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అను మతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు బీసీ సంఘాలతో సమావేశం హైదరాబాద్ లోని తన నివాసంలో సోమవారం బీసీ నేతలతో కవిత సమావేశమవుతున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇప్పటికే స్పీకరు వినతిపత్రం అందజేశారు. ధర్నా చౌక్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ పూర్తి అయినా స్పందన రాలేదు. దీంతో ఆమె అందరు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ లేఖలు రాయాలని సమావేశంలో ప్రకటించనున్నట్లు సమాచారం. లేఖలకు స్పందించకపోతే బీసీలపై వారికి ప్రేమ లేదని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని భావిస్తున్నట్లు తెలిసింది.