Rajanna Sircilla

Rajanna Sircilla: రోడ్డెక్కిన పోలీసుల భార్యలు… ఎందుకంటే

Rajanna Sircilla: ఒంటిపై ఖాకీ డ్రెస్ వచ్చిన తర్వాత …ఎదురుతిరగడాలు , పై అధికారికి నో చెప్పడాలు మర్చిపోవాలి. ఒక్క మాట చెప్పాలి అంటే….వెళ్లి కూరగాయలు తీసుకురా …గార్డెన్ క్లీన్ చేయు…ఇలా ఒక్కటేమిటి …ఏది చెప్పిన… ఎస్ సర్..అనాల్సింది. పైకే..ఇండ్లల్లో పనులు చేయించడం లేదు అనే మాట. లోలోపల మాత్రం …సేమ్ టు సేమ్ . మాకు వద్దు ఈ కొలువు అని కొలువు చేసే ఖాకీ డ్రెస్ వేసుకున్న ఖాకీలు చెప్పలేరు. సో ..అందుకే రంగంలోకి దిగారు ఆ ఖాకీల భార్యలు . ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే…రోడ్డెక్కిన ఆ ఖాకీ భార్యను మాలి ఆ ఖాకీలే అరెస్ట్ చేయడం.

సమాజంలో శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరుగక్కుండా, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడమే పోలీసుల బాధ్యత. చట్టాలను గౌరవిస్తూ తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తుంటారు పోలీసులు. ఎక్కడ, ఏ సమస్య ఉన్నా, గొడవ జరిగినా పోలీసులు అక్కడకు చేరుకుని గొడవలు తారాస్థాయి చేరుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకుంటారు. సాధారణ ఉద్యోగుల్లా పోలీసులకు ఒక సమయం అంటూ ఏదీ ఉండదు.

Rajanna Sircilla: తెలంగాణలో పోలీసుల భార్యలు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17th బెటాలియన్ ఎదుట పోలీసుల భార్యలు ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి డ్యూటీకి చేస్తున్న పనికి సంబంధం లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్‌ వ్యవస్థలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అనుసరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. శాంతి భద్రతల కోసం రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారి కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణ పేరుతో ప్రభుత్వం వారిని కుటుంబాలకు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకే పోలీస్‌ విధానం ఉండాలనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *