india vs pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకునేందుకు అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేసుకునే పనిలో పడగా, పాకిస్తాన్ అప్రమత్తమైంది. భారత్ తమపై దాడి చేస్తే ఎదురుదాడికి దిగుతామని పాక్తిస్తాన్ మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నది. భారత్ ఆయుధ సంపత్తితో పాకిస్తాన్ సరితూగే బలం లేకున్నా అమెరికా, చైనా మద్దతు రాకపోతాయా? అన్న ఆశతో ఆ దేశం ఉన్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
india vs pakistan: పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత్ గాలింపు చర్యలను వేగవంతం చేసింది. అణువణువూ గాలిస్తూ ఉన్నది. ముందుగా ఆ ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగే అవకాశం ఉన్నదని కొందరంటున్నారు. లేదు.. ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాలంటే పాకిస్తాన్ పీచమడచాల్సిందేననే భావనతో భారత్ ఉన్నట్టు చెప్తున్నారు.
india vs pakistan: ఈ దశలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారత్ సన్నద్ధంతో పాకిస్తాన్ కూడా యుద్ధ సన్నద్ధత చర్యలు చేపడుతున్నది. త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించింది. నౌకాదళం సముద్రమార్గాల్లో విన్యాసాలు నిర్వహిస్తున్నది. వాయుసేన గగనతలంలో విన్యాసాలను ప్రదర్శిస్తన్నది.
india vs pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ నిన్న సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించినట్టు సమాచారం. అక్కడ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారని అంటున్నారు. వారిని ఉత్సాహ పరిచే ప్రసంగం చేసినట్టు తెలుస్తున్నది. కొంత గందరగోళ పరిస్థితుల్లో ఆ దేశం ఉన్నా, భారత్ సంసిద్ధతను చూసి ఆ దేశం అప్రమత్తమౌతున్నట్టు తెలుస్తున్నది.