Nivetha Thomas

Nivetha Thomas: నివేదా థామస్ షాక్: సినిమాలకు బ్రేక్!

Nivetha Thomas: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోలతో నటించిన నివేదా థామస్, ‘శాకినీ డాకిని’ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటోంది. గత ఏడాది ‘35 చిన్న కథ కాదు’లో సగటు మహిళ పాత్రలో, ఇద్దరు పిల్లల తల్లిగా డీ-గ్లామర్ లుక్‌లో అదరగొట్టింది.

అయితే, ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు గడిచినా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇటీవల విజయ్ సేతుపతితో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్న సినిమాలో నివేదాను హీరోయిన్‌గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఈ రూమర్స్‌ను పూరీ టీం ఖండించింది.

Also Read: Prabhas: ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్‌లో భాగ్యశ్రీ బోర్సేకి ఛాన్స్!

Nivetha Thomas: ప్రస్తుతం నివేదా చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి, ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ‘35’ సినిమా కోసం బరువు పెరిగిన నివేదా, ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి బరువు తగ్గుతోందని, అందుకే సినిమాలు తీసుకోవడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Union Cabinet Meeting: నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *