Amaravati Relaunch

Amaravati Relaunch : జగన్‌కు ప్రభుత్వం ఆహ్వానం – జగన్ నిర్ణయం మీద ఉత్కంఠ.!

Amaravati Relaunch: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జీవం పోసే దిశగా కీలక అడుగు పడింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని మళ్లీ అభివృద్ధి చేయడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మే 2వ తేదీన రీ-లాంచ్ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండగా, మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా అధికార ఆహ్వానం పంపిన సంగతి ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రోటోకాల్ అధికారులు స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన పర్సనల్ అసిస్టెంట్ కె. నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, వేదిక పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

జగన్ హాజరవుతారా?
ఇప్పుడు అందరి దృష్టి జగన్ నిర్ణయంపైనే ఉంది. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం జరిపిన అమరావతి ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కాలేదు. పైగా ఆయన ప్రభుత్వం మూడురాజధానుల పథకాన్ని తీసుకురావడంతో అమరావతిపై వైసీపీ వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్‌కి ఆహ్వానం పంపడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఇది కేవలం అధికార గౌరవం కాదు – ప్రజల ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ విభేదాలను పక్కన పెట్టే సంకేతం కావచ్చునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read: Ponguru Narayana: అదిరిపోయే స్పోర్ట్స్ సిటీ..

Amaravati Relaunch: ఈ కార్యక్రమం ద్వారా కేంద్రం, రాష్ట్రం కలసి “అమరావతి కేవలం ఒక పార్టీదీ కాదు, ఇది ప్రతి తెలుగు వాడి కల” అన్న సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ హాజరవడమంటే రాష్ట్ర రాజకీయాల్లో మెలకువైన మార్పుకు నాంది కావచ్చు. రాకపోతే, వైసీపీ తమ మునుపటి విధానానికే కట్టుబడి ఉన్నట్టు సంకేతమిస్తుందని విశ్లేషణలు సాగుతున్నాయి.

మే 2న జరగబోయే ఈ రీ-లాంచ్ వేడుక, కేవలం అభివృద్ధి శంఖారవమే కాక, ఏపీలో రాజకీయ భవిష్యత్‌కు కొత్త దారిని చూపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలింది – జగన్ వస్తారా? అనే ప్రశ్నకి సమాధానం దొరకడం మాత్రమే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *