Balakrishna

Balakrishna: బాలయ్య హిందీ స్పీచ్‌ వైరల్!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ సమయంలో వచ్చిన ఈ గౌరవం అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ నేపథ్యంలో బాలయ్య, వారి కుటుంబానికి సంబంధించిన ఫొటోలతో పాటు ఓ క్రేజీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పద్మభూషణ్ అవార్డు స్వీకరణ సందర్భంగా బాలయ్య హిందీలో ఇచ్చిన స్పీచ్ నార్త్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. తన సినిమాలు, కుటుంబ నేపథ్యం, సేవా కార్యక్రమాల గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకర్షించాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అభిమానులు బాలయ్య వ్యక్తిత్వాన్ని, సినిమా-సామాజిక సేవలను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య మళ్లీ ‘అఖండ 2’ షూటింగ్‌లో నిమగ్నమై, బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందిస్తారని అంటున్నారు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Heavy Rains: భారీగా కురుస్తున్న వర్షాలు.. 71 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *