Puri Jagannadh

Puri Jagannadh: పూరి ‘బెగ్గర్’లో విలన్ గా కన్నడ స్టార్ హీరో!

Puri Jagannadh: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని పూరి ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘బెగ్గర్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా క్యాస్టింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌లో ఉంది.

సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే పూరి టీమ్ వెల్లడించింది. తాజాగా, కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు పూరి ప్రకటించారు. గతంలో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లో విలన్‌గా మెప్పించిన దునియా విజయ్ ఇప్పుడు పూరి సినిమాలో సందడి చేయనున్నాడు. ఈ స్టార్ కాస్ట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూరి కనెక్స్ట్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం పూరి మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘బెగ్గర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *