Suriya- Venky Atluri

Suriya- Venky Atluri: సూర్య – వెంకీ అట్లూరి కాంబో మాఫియా డాన్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా!

Suriya- Venky Atluri: తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి కొత్త చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ తిరిగే ఈ కథ, యాక్షన్‌తో పాటు లోతైన ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకోనుందట. సూర్య కెరీర్‌లో భిన్నమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం కథాంశం తాజాగా, గట్టిగా ఉంటుందని టాక్.

ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. హీరోయిన్‌గా గ్లామరస్ బ్యూటీ కాయదు లోహర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో మోషన్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటనకు సిద్ధమవుతోంది. సూర్య – వెంకీ కాంబో నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *