Chiranjeevi-Nayanthara

Chiranjeevi-Nayanthara: మరోసారి మెగాస్టార్ చిరంజీవి-నయనతార జోడీ..!

Chiranjeevi-Nayanthara: టాలీవుడ్‌లో సంచలన కాంబోల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి జోడీ ముందు వరుసలో ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అనిల్, ఇప్పుడు చిరంజీవితో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార కనిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Hit-3: ‘హిట్-3’: బాక్సాఫీస్‌ను రగిలించనున్న యాక్షన్ థ్రిల్లర్!

Chiranjeevi-Nayanthara: ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా జోడీ కట్టనుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఒకవేళ ఈ జోడీ నిజమైతే, సినిమాకు మరింత క్రేజ్ రానుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి-అనిల్ కాంబో ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ వాసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *