Pakistan:

Pakistan: భార‌త్‌పై అణ్వాయుధాలు వేసి తీరుతాం: పాక్ మంత్రి

Pakistan: పాకిస్తాన్ దేశం మ‌రోసారి భార‌త్‌తో క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ది. ప‌ర్యాట‌కుల మృతితో ఆగ్ర‌హంతో ఉన్న భార‌త్‌పై త‌ర‌చూ ఆ దేశాధినేత‌లు ప్రేలాప‌న‌లు పేలుతున్నారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్ తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యాల‌తో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతున్న‌ది. అంత‌ర్జాతీయంగా మ‌రో దేశం మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతో అస‌హ‌నంతో ఏదో ఒక‌టి మాట్లాడేస్తున్నారు.

Pakistan: సింధు జ‌లాల నిలిపివేత‌పై ఆ దేశ మంత్రి హ‌నీఫ్ అబ్బాసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సింధు జ‌లాల‌ను పాకిస్తాన్‌కు రాకుండా అడ్డుకుంటే భార‌త్‌తో యుద్ధం చేస్తామ‌ని ప్రేలాప‌న‌లు పేలాడు. 130 అణ్వాయుధాల‌ను భార‌త్ వైపు గురి పెట్టామ‌ని వాటితో దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించాడు.

Pakistan: పాక్ గ‌గ‌న‌త‌లం నుంచి భార‌త్ విమానాల‌పై నిషేధం విధించిన‌ రెండు రోజుల్లోనే ఆదేశానికి ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని, ఇంకో 10 రోజులు ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే అక్క‌డి విమాన‌యాన సంస్థ‌లు దివాళా తీస్తాయ‌ని హెచ్చ‌రించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *