Peddapalli District: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అన్న పాట నాలుగు దశాబ్దాల క్రితం వచ్చింది. ఆ పాట రాక మునుపు నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ దవాఖానలపై చిన్నచూపు ఉన్నది. సకల సౌకర్యాలతో నిబద్ధతతో కూడిన వైద్య సిబ్బంది ఉండి సరైన వైద్యం చేస్తామని భరోసా ఇచ్చినా ఎందరో ఆ వైపు కంటే ప్రైవేటు దవాఖానల వైపే వెళ్తుంటారు. అందుకే ఈ రోజుల్లో ప్రైవేటు దవాఖానలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.
Peddapalli District: ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కుటుంబం ఆదర్శంగా నిలిచింది. సర్కారు ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకొన్న కలెక్టర్ భార్య విజయ, అదే ఆసుపత్రిలో పండంటి బిడ్డను ప్రసవించింది. సర్కారు ఆసుపత్రులన్నా, సర్కారు బడులన్నా చిన్నచూపు చూస్తున్న ఈ రోజుల్లో ఈ కుటుంబం ఆదర్శంగా నిలిచి అందరికీ బరోసా కల్పించింది.
Peddapalli District: కలెక్టర్ భార్య విజయ గర్భం దాల్చిన నాటి నుంచి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్సలు చేయించున్నారు. ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అభినందనలు తెలిపారు. తన కొడుకును ఎత్తుకొని ఆనందం వ్యక్తంచేశారు.

