Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని డీజీపీ జితేందర్ తెలిపారు. వీరిలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి విషయంలో చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని తెలిపారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ‘లీవ్ ఇండియా’ నోటీసులు ఇప్పటికే కొంతమందికి జారీ చేసినట్టు పేర్కొన్నారు.
హెల్త్ బేస్‌పై వీసాలు పొందినవారికి ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉండగా, మిగిలిన వారు రేపు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని డీజీపీ వివరించారు. అంతేకాక, ఈ నెల 30వ తేదీ వరకు అటల్ బోర్డర్ ద్వారా వెళ్లే అవకాశం కల్పించినట్టు తెలిపారు. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
