Akhanda 2

Akhanda 2: ‘అఖండ 2’ విదేశీ లొకేషన్స్‌పై ఫోకస్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. గోదావరి ప్రాంతంలో ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు విదేశీ లొకేషన్స్‌పై ఫోకస్ పెట్టింది. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం జార్జియాలో లొకేషన్స్ వేటలో బిజీగా ఉన్నారు. మే మొదటి వారంలో బాలయ్యతో పాటు కీలక తారాగణంతో జార్జియాలో ఓ ముఖ్యమైన షెడ్యూల్‌ను చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

‘అఖండ’లో సంచలనం సృష్టించిన బాలయ్య, ఈ సీక్వెల్‌లో మరోసారి అఘోరి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ చిత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు మరో విజయాన్ని అందించనుందని టాక్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *