BRS Silver Jubilee:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. 2025 ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మహాసభ, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సభ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ సభా ప్రాంగణం వద్ద సందడి నెలకొన్నది. సభ నిర్వహణకు బాహుబలి వేదికను కూడా ఏర్పాటు చేశారు.
BRS Silver Jubilee:ఏప్రిల్ 27న ఆదివారం ఎల్కతుర్తిలోని 1213 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా జనసమీకరణ జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. వేదిక కోసం 120 ఫీట్ల పొడవు, 80 మీటర్ల వెడల్పుతో భారీ వేదికను నిర్మించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 400 మంది ముఖ్య నేతలు ఆసీనులయ్యేందుకు ఈ వేదికను తీర్చిదిద్దారు.
BRS Silver Jubilee:రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకు పైగా వాహనాలు తరలివస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు 1059 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేవారు. ఆ మేరకు పార్కింగ్ నిర్వహణ కోసం 2000 మంది వలంటీర్లను రెడీగా ఉంచారు. ఆవరణలో 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. 20/50 సైజుతో 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు.
BRS Silver Jubilee:ఎల్కతుర్తి సభా వేదికకు ఐదుదిక్కులా 5 జోన్లవారీగా విభచించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆ ఐదు జోన్ల నుంచి వచ్చే జనం కోసం ఈ రోడ్ మ్యాప్‌ను ఆయా జిల్లాల నేతలకు అందజేశారు. అదే విధంగా ఆ ఐదు జోన్ల వారీగా వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఐదు పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే పార్కింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
BRS Silver Jubilee:ఈ సభకు వచ్చే ప్రజల కోసం 10 లక్షలకు పైగా వాటర్ బాటిళ్లను సిద్ధం చేసి ఉంచారు. అదే విధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 6 లక్షలను సిద్ధం చేసేందుకు ప్రణాళిక చేసి ఉంచారు. ఆయా రూట్లలో 6 అంబులెన్స్‌లను, పరిసరాల్లో 12 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉంచారు. సభా ప్రాంగణం పరిసరాల్లో 1200 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ఉంచారు.
BRS Silver Jubilee:2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ఏర్పాటైన పార్టీ అనంతర కాలంలో బీఆర్ఎస్‌గా అవతరించింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి 14 ఏండ్ల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి బీఆర్ఎస్ నాయకత్వం వహించింది. ఆపార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులకు దిశానిర్దేశం చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు.
BRS Silver Jubilee:ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేండ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్ర దిశా, దశను సమూలంగా మార్చివేసింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చేపట్టిన పథకాలతో బీఆర్ఎస్ తనదైన ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రానికి గుర్తింపును తెచ్చింది. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలతో ఆ పార్టీకి అవినాభావ సంబంధం ఏర్పడింది.
BRS Silver Jubilee:గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వివిధ స్తాయిల్లో పోరాటాల్లో నిలిచింది. అసెంబ్లీలో, బయట ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ తన ఉనికిని చాటుకున్నది. ఈ దశలో జరుగుతున్న పార్టీ రజతోత్సవ సభకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సభలో కేసీఆర్ భవిష్యత్తు రాజకీయాలపై మాట్లాడే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఏడాదిన్నరగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని కేసీఆర్.. ఇక నుంచి ప్రత్యక్షంగా పాల్గొని ప్రతిపక్షపాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.