Hydra Commissioner:హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ల తొలగింపు కలకలం రేపింది. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభ పోస్టర్లను నగరంలోని పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు గోడలపై అతికించారు. వాటిని రాత్రిపూట వచ్చిన హైడ్రా సిబ్బంది తొలగిస్తుండగా, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోబోయారు.
Hydra Commissioner:అయినా పోస్టర్లను చించివేసి ఓ వ్యాన్లో ఆ పోస్టర్లను, బ్యానర్లను వేసి హడావుడిగా తరలిస్తుండగా, మరో వాహనానికి ఢీకొన్నది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో హైడ్రా పోస్టర్లను చింపి వేగంగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తమ ఎమ్మెల్యే పోస్టర్లను ఎందుకు చించుతున్నారు, ఇంకా సభ 27న ఉన్నది, ఒక్క రోజైనా ఉండనివ్వండి.. అని కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ కార్యకర్త ఆ సిబ్బందిని వేడుకున్నా వినకుండా సిబ్బంది పోస్టర్లను చించివేయసాగారు.
Hydra Commissioner:ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్ల తొలగింపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పోస్టర్ల తొలగింపు సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమేనని ఆయన చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఈ ఘటనపై విచారణ చేస్తామని రంగనాథ్ చెప్పడం గమనార్హం.
Hydra Commissioner:ఏదేమైనా ఎన్నో రకాల పోస్టర్లు ఉన్నా, బీఆర్ఎస్ పోస్టర్లనే టార్గెట్ చేస్తూ హైడ్రా చించివేయడంపై ప్రజల నుంచి విస్మంయ వ్యక్తమవుతున్నది. సభ ఇంకా ఒకరోజు ఉన్నా, వాటిని చించి వేయడం సరికాదని అభిప్రాయడుతున్నారు. పలుచోట్ల రాజకీయ పార్టీలవే కాకుండా, విద్యా, వ్యాపార పోస్టర్లు, బ్యానర్లు ఉన్నా వాటిని తొలగించకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపార్టీ అయినా భారీ సభ జరుపుకున్నప్పుడు, అది జరిగేంత వరకూ ఉంచాలని సూచిస్తున్నారు.

