Horoscope Today: ఈ శుక్రవారానికి 12 రాశుల వారికీ విశేష శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభించే సూచనలు, కొంతమంది కోసం ఇది కొత్త ఆరంభానికి అవకాశం కూడా అవుతుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి మార్గం కనిపించనుండగా, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి కీలక అంశాల్లో పాజిటివ్ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఇక, రాశి వారీగా ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం:
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగస్తులకు దశ అనుకూలంగా ఉంటుంది. పనిలో ఒత్తిడితోపాటు అధిక బాధ్యతలు ఎదురైనా, ఫలితం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుంది. మానసికంగా హాయిగా ఉండే రోజు. పెళ్లి సంబంధిత శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. మిత్రులతో సంతోషంగా గడిపే అవకాశం. ఆధ్యాత్మికంగా అలయాల సందర్శన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభసమయం. డిమాండ్ పెరగడం వల్ల మంచి ఆఫర్లు అందే అవకాశం. కుటుంబానికి సంబంధించిన శుభపరిణామాలు జరగవచ్చు. మీ సామాజిక సేవా భావన ప్రాశంసనీయం. ఆదాయంలో వృద్ధితో పాటు మానసిక సంతృప్తి లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
పనిలో స్థిరత ఉండి, స్వల్ప ప్రయత్నంతోనే ఆర్థిక పురోగతి లభించనుంది. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. స్నేహితుల సాయం ముఖ్యంగా ఉంటుంది. చిన్న ఆస్తి వివాదం పరిష్కార దిశలోకి వెళ్లే సూచన. ఆరోగ్య పరంగా నియమిత జీవనశైలి పాటించాలి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
విద్య, రక్షణ, న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్. వృత్తి పరంగా ప్రమోషన్, ప్రోత్సాహం లభించవచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం. కుటుంబ వ్యయాలు అధికమైనా, ఆదాయానికి సంబంధించి లాభదాయక ఫలితాలు ఎదురవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక విషయాల్లో కొత్త దిశగా అడుగులు వేయవచ్చు. వృత్తిపరంగా ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. రుణ ప్రయోజనాలు కూడా అనుకూలించవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు ప్రత్యక్షమవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
పనిలో ప్రాధాన్యం పెరిగి, మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం. ప్రతి ప్రయత్నం ఫలితంగా మారే రోజు. వ్యాపారాలలో లాభాలు వృద్ధి చెందుతాయి. వినోద యాత్రలతో మానసిక ఉల్లాసం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా శుభవార్తలతో నిండే రోజు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగవచ్చు కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లవచ్చు. పెళ్లి విషయాల్లో తీపి మార్పులు. పిల్లల విద్య, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పథకాలలో విజయం సాధించగలరు.
Also Read: Astro Tips: రోడ్డుపై పడి ఉన్న ఈ 6 వస్తువులను పొరపాటున కూడా తీసుకోకండి..
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తిపరంగా మంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారపరంగా జాగ్రత్త అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం. కుటుంబ వ్యయాలు పెరిగినా, ఆదాయ వృద్ధి సమతుల్యం ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్‌పై ప్రభావం చూపవచ్చు. మిత్రుల సాయం అవసరమైన సమయంలో వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. షేర్లు, పెట్టుబడుల్లో మంచి ఫలితం లభించే సూచన. వ్యాపార వ్యయాలు తగ్గించుకుంటే లాభాలు మరింత పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తిపరంగా ప్రోత్సాహకరమైన సమయం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. కుటుంబంలో అనవసర తగువుల నుంచి దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. మిత్రుల సహకారం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తిలో ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన పరిచయాలు కొత్త అవకాశాలకు దారి తీస్తాయి. ఆర్థికంగా లాభాలున్నా, అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం. ఉద్యోగ, పెళ్లి సంబంధిత శుభవార్తలు మీను సంతోషపరిస్తాయి.