TheRajaSaab

TheRajaSaab: ‘ది రాజా సాబ్’ రిలీజ్‌పై సంచలన అప్డేట్..!

TheRajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హార్రర్ కామెడీ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గతంలో ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించినప్పటికీ, పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో సంచలన అప్డేట్ పంచుకున్నారు. ఓ ఆటోరిక్షాపై ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ ఫోటో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, “అలర్ట్.. వేడి గాలులు మేలో మరింతగా పెరగనున్నాయి” అని క్యాప్షన్ జోడించారు.

Also Read: D56: మారి సెల్వరాజ్ తో ధనుష్ 56 వ సినిమా!

TheRajaSaab: దీంతో మేలో ఈ చిత్రం నుంచి భారీ అప్డేట్ రానుందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ప్రభాస్ లుక్, టీజర్ లేదా రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

The RajaSaab Glimpse :

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *