Pakistan: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. పర్యాటకులను లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం భారత్ తీవ్రంగా స్పందించి, పాకిస్థాన్‌పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రభుత్వం క్షిపణి పరీక్ష చేయబోతున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరంలో భూమి మీద నుంచి భూమి మీద ప్రయోగించే క్షిపణిని పరీక్షించనున్నారు. ఈ విషయం గురించి పాక్ అధికారులు ముందుగా నోటీసు కూడా ఇచ్చారు.
ఈ పరీక్ష ప్రకటన నేపథ్యంలో, భారత్ భద్రత విషయంలో మరింత అప్రమత్తమైంది. సరిహద్దుల్లో, సముద్రతీరాల్లో భద్రతా బలగాలు కట్టుదిట్టంగా మోహరించబడ్డాయి. ముంబయి వంటి ప్రధాన నగరాల్లో బీచ్‌లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పోలీసులు గస్తీ పెంచారు. పహల్గాం దాడిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై భద్రతా అంశాలపై చర్చించింది. రక్షణ సంబంధమైన పలు నిర్ణయాలు తీసుకుంది.
Also Read: india vs pakistan: 64 ఏళ్ల సింధు జలాల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్ ఇక ఎడారే!
Pakistan: భారత్ ఈ దాడికి పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలే బాధ్యులని ఆరోపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ దౌత్యపరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
పహల్గాం దాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య పరిస్థితి తేలికగా కనిపించట్లేదు. రెండు దేశాలు అప్రమత్తంగా ఉండేలా మారాయి. భద్రతా అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది.