india vs pakistan:

india vs pakistan: 64 ఏళ్ల సింధు జ‌లాల‌ ఒప్పందం ర‌ద్దు.. పాకిస్తాన్ ఇక ఎడారే!

india vs pakistan: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అనంత‌రం భార‌త‌దేశం తీసుకున్న తీవ్ర నిర్ణ‌యంతో పాకిస్తాన్ దేశం ఇక ఏడారిగా మిగ‌ల‌నున్న‌ది. 64 ఏళ్ల నాటి సింధు జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ ర‌ద్దు చేసుకోవ‌డంతో పాక్‌కు ఈ దుస్థితి దాపురించ‌నున్న‌ది. తొలి నాళ్ల నుంచి పాకిస్తాన్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఊత‌మిస్తున్న‌ప్ప‌టికీ భార‌త్ మాత్రం సింధు జ‌లాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌ర్యాట‌కుల‌పై ఘోర దాడి నేప‌థ్యంలో ఈ తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

india vs pakistan: ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన 26 మందిని ఉగ్ర‌వాదులు పొట్ట‌న‌పెట్టుకున్నారు. సుమారు 60 మంది వ‌ర‌కు గాయాల‌పాల‌య్యారు. ఇప్ప‌టికే భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మై ముష్క‌రుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనికి పాకిస్తాన్ ప్రేర‌ణే కార‌మ‌ని భార‌త్ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. ల‌ష్క‌రే తోయిబా ప్రాక్సీకి చెందిన టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ తామే ఈ ఉగ్ర‌దాడికి బాధ్య‌ల‌మ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఈ దాడిలో పాకిస్తాన్ ప్ర‌మేయం ఉన్న‌ద‌ట్టు భార‌త్ ఇంటెలిజెన్స్ సంస్థ‌లు క‌నుగొన్నాయి.

india vs pakistan: సీమాంతర ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు భార‌త‌దేశం చాలా సార్లు అవ‌కాశం ఇచ్చింది. అయినా దానిని పాకిస్తాన్ నిల‌బెట్టుకోలేదు. ఇప్ప‌డు తాజా ఉగ్ర‌దాడితో ఇక ఉపేక్షించేది లేద‌ని సింధుజ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. పాక్‌తో దౌత్య సంబంధాల‌తోపాటు 64 ఏళ్ల నాటి సింధు జ‌లాల ఒప్పందాన్ని కూడా భార‌త్ ర‌ద్దు చేసుకోవ‌డం పాక్‌కు శ‌రాఘాత‌మే.

india vs pakistan: ప్ర‌పంచంలో అతి త‌క్కువ నీటి వ‌న‌రులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. దీనికి ప్ర‌ధాన ఆయువు ఇండ‌స్ రివ‌ర్ వాట‌ర్ ఒక్క‌టే ఆ దేశానికి ఆధారం. మొత్తం ఆ దేశ వ్యవ‌సాయం సింధు జ‌లాల‌పైనే ఆధార ప‌డి ఉంటుంది. ఇక్క‌డి పంజాబ్‌, సింధ్ వంటి రాష్ట్రాల‌కు ఇదే ప్ర‌ధాన వ‌న‌రు. అక్క‌డి బ‌లూచిస్తాన్‌, ఖైబ‌ర్‌, ఫ‌ఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి త‌క్కువ నీటి వ‌న‌రులు కలిగిన ప్రాంతాలు. ఇప్పుడు భార‌త్ ఈ సింధు జ‌లాల‌ను ఆపేస్తే ఆయా ప్రాంతాల‌న్నీ ఎడారిగా మారుతాయి. ఇప్ప‌టికే ద్ర‌వ్వోల్బ‌ణం, పేద‌రికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ దేశం.. ఈ దెబ్బ‌కు మ‌ల‌మ‌ల మాడిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. దీంతో అక్క‌డ తాగునీటికి కూడా కొర‌త ఏర్ప‌డుతుంది.

india vs pakistan: సింధు న‌ది చైనాలో పుట్టి భార‌త్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్ర‌వ‌హిస్తుంది. అందుకే భార‌త్‌, పాక్ దేశాలు ఈ సింధు న‌దిపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ న‌దీ జ‌లాల‌పై 1960లో అప్ప‌టి భార‌త ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్య‌క్షుడు అయూబ్‌ఖాన్ వ‌ర‌ల్డ్ బ్యాంకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం స‌మ‌క్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్ర‌కారం తూర్పు న‌దులైన బియాస్‌, రావి, స‌ట్లేజ్‌పై భార‌త్‌కు, సింధు, చినాబ్‌, జీలం న‌దుల‌పై పాక్‌కు నియంత్ర‌ణ ఉంటుంది.

india vs pakistan: ఈ ఒప్పందం ద్వారా సింధు న‌ది జ‌లాల్లో 80 శాతం నీటిని పాక్ వాడుకుంటున్న‌ది. ఇంత‌కు ముందు చాలా సార్లు ఈ సింధు జ‌లాల ఒప్పందం వివాదాస్ప‌దం అయింది. ఇండ‌స్ వాట‌ర్ ట్రీటీ నిర్ధేశించిన విధానాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలంటూ ఉగ్ర‌దాడుల‌ను ప్రోత్స‌హిస్తూనే మ‌రోవైపు పాక్ శాంతి వ‌చ‌నాలు ప‌లికేది. అయితే ఈసారి ఆ దేశానికి గ‌ట్టి బుద్ధి చెప్పాల‌నే సింధు జ‌లాల‌ను ఆపాల‌ని భార‌త్ నిర్ణ‌యించుకున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *