Shraddha Srinath: లాస్ట్ మంత్ 29వ తేదీతో 35వ సంవత్సరాలలోకి అడుగు పెట్టింది శాండిల్ వుడ్ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్. ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్థా శ్రీనాథ్ మొదటి సినిమాతోనే తన గ్లామర్ తోనూ, యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు తెలుగులో రాలేదు. ఆది సరసన ‘జోడీ’లోనూ, సందీప్ కిషన్ తో ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’లోనూ నటించింది. మొన్న సంక్రాంతి కానుకగా వచ్చిన వెంకటేశ్ ‘సైంథవ్’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఆమెకు లక్కీగా విశ్వక్ సేన్ ‘మెనానిక్ రాకీ’లో చోటు దక్కింది. ఈ సినిమా నెలాఖరులో రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే… తనలోని గ్లామర్ ను గుర్తించమని, స్కిన్ షో విషయంలో తాను రాజీపడేది లేదని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పకనే చెబుతోంది. యెదపై లవ్ అంటూ వేసుకున్న టాటూని ప్రదర్శిస్తూ ఇటీవల ఫోటోలకు ఫోజులిచ్చి, వాటిని ఇన్ స్టాగ్రామ్ లోనూ శ్రద్థ శ్రీనాథ్ పోస్ట్ చేసింది. మరి ఆమె మనోవాంఛ ఫలిస్తుందో లేదో చూడాలి.