Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘డ్రాగన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ షూటింగ్ కర్ణాటకలోని మంగళూరులో జోరుగా సాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ కాగా, భారీ పోర్ట్ సెట్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నాలుగు రోజులపాటు కొనసాగనుంది.
Also Read: GHAATI: అనుష్క ‘ఘాటి’ రిలీజ్‌పై సస్పెన్స్!
Dragon: మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ డైనమిక్ పెర్ఫార్మెన్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని టాక్.