Amravati: APPSC చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ ను నియమించింది ప్రభుత్వం. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధను చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ తెలిపారు.

1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌(IPS) అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా ఆమె పనిచేశారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పనిచేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పోస్ట్ కలిగా ఉంది. ప్రస్తుతం అనురాధ రాకతో ఫీల్ ఆప్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *