Kingdom First Song: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్‌డమ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్ర యూనిట్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘కింగ్‌డమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఈ వారంలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఈ పాట ప్రేక్షకుల్లో సంచలనం రేగుస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ యాక్షన్ అవతార్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, అనిరుధ్ సంగీతంతో ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, ఫస్ట్ సింగిల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!