Kiran arrest game starts

Kiran arrest game starts: ముందే అలర్ట్‌ చేసిన ‘మహాన్యూస్‌’

Kiran arrest game starts: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు. మంద కృష్ణ మాదిగను అవమానించారంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై కృష్ణవేణి పోస్టులు పెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిను దాచేపల్లి పోలీసులు కృష్ణవేణిని అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణవేణిని జైలుకు తరలించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు… అనంతరం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆమెను పల్నాడు జిల్లా, దాచేపల్లికి తీసుకొచ్చారు. కృష్ణవేణి స్వగ్రామం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి. ఏపీలోని అధికార కూటమి నేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని కృష్ణవేణిపై ఆరోపణలు ఉన్నాయి.

క్రిష్ణవేణి పాలేటి… సోషల్‌మీడియా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పాలేటి కృష్ణవేణి, ఆమె భర్త… మొదట టీడీపీ సానుభూతి పరులుగా ఉండేవారు. సడెన్‌గా నారా లోకేష్‌ టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. ఆ సందర్భంలో ఆమెకు వైసీపీ గాలం వేసి.. తమ పార్టీ సోషల్‌మీడియా ఊబిలోకి దింపింది. ఎలాంటి వారైనా సరే ఆ పార్టీలోకి వెళ్లాక.. అదేంటో మరి విపరీత ధోరణిలోకి వెళ్లిపోతారు. పాలేటి కృష్ణవేణి దంపతుల విషయంలోనూ అదే జరిగింది.

ఎన్డీయే కూటమి నేతలపై ఆమె నీచమైన పోస్టులు పెడుతూ చెలరేగిపోయారు. వైసీపీ నేతల ప్రోద్భలంతో అత్యంత దిగజారుడు భాషలో కూటమి నేతల్ని సోషల్‌ మీడియాలో దూషించేవారు. వైసీపీ ఆఫీసు నుండి వచ్చిన మార్ఫింగ్‌ ఫొటోలు, ఫేక్‌ కంటెంట్‌తో ఆమె నేతలపై దాడి చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పాలేటి కృష్ణవేణి ఉధృతి ఆగలేదు. ఆఖరికి మొన్న కిరణ్‌ చేబ్రోలు అరెస్టు సందర్భంలో కూడా ఆమె తప్పుడు పోస్టులు పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ల భార్యలను దారుణంగా తిట్టాలని, ఆ వీడియోలను పోస్టు చేయాలని సోషల్‌మీడియాలో వైసీపీ యాక్టివిస్టులను రెచ్చగొట్టారు.

ALSO READ  Harish Rao: సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఘాటు వ్యాఖ్య‌లు

Also Read:  Good Fry A-Team B-Team: వైసీపీకి షాక్‌ ఇచ్చిన పాస్టర్లు.. రంగంలోకి బి-టీమ్‌

Kiran arrest game starts: ఆ సమయంలోనే కిరణ్‌ చేబ్రోలు అరెస్టుతో రెండో విడత సోషల్‌మీడియా అరెస్టులు ఉండబోతున్నాయని మహాన్యూస్‌ బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌లో హెచ్చరించాం కూడా. ఆ కథనంలో అరెస్ట్‌ లిస్టులో ఉన్న వైసీపీ యాక్టివిస్టుల పేర్లు పేర్కొంటూ.. లిస్టులో అనితా రెడ్డి, పాలేటి కృష్ణవేణి వంటి వైసీపీ మహిళా యాక్టివిస్టులు కూడా ఉన్నారని పక్కాగా తెలియజేశాం. అప్పటికైనా సోషల్‌ మీడియాలో భూతులు, చంపుతామనే బెదిరింపులతో రెచ్చిపోతున్న వైసీపీ కార్యాకర్తలు జాగ్రత్త పడతారనుకున్నాం. కాని వారి పంథా వారిదే.. పోలీసుల విధి పోలీసులు నిర్వర్తించాల్సిందే. చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోవాల్సిందే అని మరోసారి రుజువైంది. చెప్పినట్లే పాలేటి కృష్ణవేణి అరెస్ట్‌ కాగా, అనితా రెడ్డి వంటి వాళ్లు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *