Good Fry A-Team B-Team

Good Fry A-Team B-Team: వైసీపీకి షాక్‌ ఇచ్చిన పాస్టర్లు.. రంగంలోకి బి-టీమ్‌

Good Fry A-Team B-Team: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మత రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. చిన్న అంశాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకునేందుకు తెగ ఆరాట పడుతున్నారు వైసీపీ నేతలు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాట, టీటీడీ గోశాలలో గోవుల మృతి, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి, వక్ఫ్ బిల్లు వంటి విషయాలను వాడుకుంటూ… ఒక రకంగా హిందుత్వంపై ఆ పార్టీ యుద్ధం ప్రకటించిందని పలువురు పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా క్రైస్తవులకు అత్యంత పర్వదినమైన గుడ్ ఫ్రైడేను కూడా వదలకుండా రాజకీయాలకు వాడుకుంటున్నారు వైసీపీ నేతలు. పాస్టర్లకు తమ ప్రభుత్వంలో గౌరవ వేతనం ఇచ్చామని, కూటమి దాన్ని నిలిపివేసిందని వైసీపీ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తూ వస్తోంది.

దీనికి సీఎం చంద్రబాబు వైసీపీ ఊహించని విధంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పాస్టర్లకు రూ.5 వేల పింఛన్‌ను పునరుద్ధరిస్తూ, 2024 మే నుంచి నవంబర్ వరకు 7 నెలలకు సంబంధించి రూ.35 వేల బకాయిలను కూడా గుడ్ ఫ్రైడే నాడు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందు కోసం రూ.30 కోట్ల నిధులను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం, వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టి, జగన్‌కు షాక్ ఇచ్చింది. దీంతో గుడ్‌ఫ్రైడే నాడు చంద్రబాబు పాస్టర్లకు చేసిన మేలును కూడా ట్విస్ట్‌ చేస్తూ… పాస్టర్‌ ప్రవీణ్‌ మరణంతో ముడిపెట్టి… రాజకీయం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. ప్రపంచ శాంతి దూతగా చెప్పుకునే కేఏ పాల్‌ని రంగంలోకి దించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

పాస్టర్లకు గుడ్‌ ఫ్రైడే కానుకతో సీఎం చంద్రబాబు కొట్టిన దెబ్బకు వైసీపీ టోన్‌ మూగబోగా… ఆ పార్టీకి ఆపద్భాందవుడు, వైసీపీకి బి-టీమ్‌గా పార్టీ నడుపుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ రంగంలోకి దిగిపోయారు. వైసీపీ మాట్లాడలేని విషయాలు కొన్నింటిని కేఏ పాల్‌ అలవోకగా మాట్లాడగలరు. ఎందుకంటే ఆయనో మత ప్రచారకుడు. సున్నితమైన మత సంబంధ విషయాల్లో కూటమిపై బురద జల్లడానికి పాస్టర్‌ పాల్‌ని బి-టీమ్‌గా వైసీపీ నియమించుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే‌… తమ్ముడూ జగన్‌.. మై హూనా.. అంటూ రంగంలోకి దిగిపోయిన కేఏ పాల్‌.. చంద్రబాబుకు ఇప్పుడే ఎందుకు పాస్టర్లు గుర్తుకొచ్చారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.

Also Read: Arrest Time Very Soon: ఏపీలో సంచనాలు నమోదు కాబోతున్నాయా?

Good Fry A-Team B-Team: పాస్టర్‌ ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని మెడలో బోర్డు తగిలించుకుని తిరుగుతున్న కేఏ పాల్‌.. ఆ హత్యను ప్రభుత్వం రూపు మాపే ప్రయత్నం చేస్తోందా అంటూ ముడిపెట్టేశారు. గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ కింద 8 వేల మంది పాస్టర్లకు నెలకు 5 వేలు ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారని, కానీ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రిస్టియన్లు మందుకు రావడంతో పాస్టర్ల ద్వారా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ మితిమీరిన తెలివితేటల్ని ప్రదర్శించారు మిస్టర్‌ పాల్‌. ఇప్పుడు 8 వేల మంది పాస్టర్లకు ఐదు వేలు ఇస్తే.. మరి 80 వేల మంది పాస్టర్ల సంగతి ఏంటని నోటికొచ్చిన లెక్క చెప్పేశారు. చంద్రబాబు ఇస్తున్న 5 వేల రూపాయలకు పాస్టర్లు అమ్ముడు పోవద్దని చెప్తూనే.. మనం మన పార్టీనే గెలిపించుకుందామంటూ ఇండైరెక్ట్‌గా వైసీపీకి మద్ధతు రాగం పాడి వినిపించారు కేఏ పాల్‌.

ALSO READ  Tata Steel Chess 2024: టాటా స్టీల్ చెస్ విజేత కార్ల్సన్

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *