Tragedy: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని రామాపురం గ్రామంలో ఉన్న గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కృష్ణవేణి (21) మనస్తాపానికి గురై కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణవేణి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని పిగుడుపల్లి గ్రామానికి చెందినవారు. ఉగాది పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె, ఏప్రిల్ 18న (శుక్రవారం) తల్లితో కలిసి కాలేజీకి తిరిగొచ్చింది. అదే రోజు రాత్రి తల్లితో కలిసి హాస్టల్‌లో ఉండగా, తెల్లవారుజామున వాష్‌రూమ్‌కు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లింది. అక్కడినుంచి కాలేజీ భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: Warangal: మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం.. దుండగుడికి దేశశుద్ధి
విద్యార్థులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిలుకూరు ఎస్సై రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.