Retro: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రెట్రో’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం భారీ బజ్ సృష్టిస్తోంది. ట్రైలర్, ఆడియో విడుదలకు సమయం ఆసన్నమవుతుండగా, తాజాగా చిత్రం రన్‌టైమ్ వెల్లడైంది. మేకర్స్ ఈ సినిమాను 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాల నిడివితో సిద్ధం చేశారు. రన్‌టైమ్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 8 కట్స్ సూచించినట్లు సమాచారం. మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది తెలియాలంటే, థియేటర్లలోనే చూడాలి. సూర్య, కార్తీక్ కాంబో నుంచి మరో బ్లాక్‌బస్టర్ రాబోతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.
