Muthayya

Muthayya: సామ్ చేతుల మీదుగా ‘ముత్తయ్య’ మూవీలోని ‘అరవైల పడుసోడు’ సాంగ్ రిలీజ్!

Muthayya: కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ కీలక పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘ముత్తయ్య’. దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌గా, సహ నిర్మాతగా దివాకర్ మణి వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలో ఈటీవీ విన్‌లో గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. తాజాగా, స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ‘అరవైల పడుసోడు..’ అనే మెలోడియస్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట సినిమా పై అంచనాలను మరింత పెంచింది. ‘ముత్తయ్య’ కథ, నటన, సాంకేతిక విలువలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అవార్డులను కూడా గెలుచుకుంది. ఈటీవీ విన్‌లో ప్రసారానికి ముందు, సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సమంత రిలీజ్ చేసిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *