Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సమీపంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. బుధవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా రామన్నపేటలో ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ ప్రాంత జనజీవనాన్ని పణంగా పెట్టే పరిశ్రమలు మాకొద్దు అంటూ తీవ్రంగా నిరసిస్తున్నారు.
Telangana: ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆరెస్ నేతలను, ఇతర ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రామన్నపేట సమీపంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ర్యాలీలుగా ప్రజలు తరలివస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని ప్రతినబూనుతున్నారు.
Telangana: ఈ ప్రాంత పర్యావరణాన్ని, జనజీవనాన్ని కలుషితం చేసే సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా విద్యార్థులు వివిధ గ్రామాల్లో ర్యాలీలు తీస్తున్నారు. పరిశ్రమ ద్వారా కలుషితాలు అక్కడి నీటి వనరుల్లో కలిసి, మూసీ నదికి చేరుతుందని తద్వారా పంట పొలాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Telangana: అక్కడి తాటి, ఈత వనాలు కనుమరుగై, కల్లు గీత వృత్తికి వృత్తిదారులు దూరమవుతారని, జీవాలు, పశువుల మేపులకు గడ్డి కరువవుతుందని నిరసన వ్యక్తమవుతుంది. కల్లు, గడ్డి కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.