NTR 31

NTR 31: NTR 31: మూడు వారాల పాటు నాన్ స్టాప్!

NTR 31: టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ స్టైల్‌లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఎన్టీఆర్‌తో పాటు పలువురు కీలక నటీనటులు ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు స్వీకరించాయి. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naga Vamsi: త్రివిక్రమ్ లైనప్ పై నాగవంశీ క్లారిటీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *