Sarangapani Jathakam

Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం.. ట్రైలర్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Sarangapani Jathakam: మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష కామెడీ టైమింగ్‌తో ట్రైలర్ పూర్తి ఫన్ రైడ్‌గా సాగింది.

Also Read: Coolie: కూలీ తెలుగు రైట్స్ కి భారీ డిమాండ్!

Sarangapani Jathakam: జాతకాన్ని గట్టిగా నమ్మే హీరో జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ప్రేమలో అడ్డంకులు, వాటిని అతడు ఎలా అధిగమించాడనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్షల కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని ట్రైలర్ సూచిస్తోంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్. భారీ క్యాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. కామెడీ, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ‘సారంగపాణి జాతకం’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

సారంగపాణి జాతకమ్ ట్రైలర్ : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మరో డివైజ్‌లో లాగిన్‌ అయి ఉందా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *