Rammohan Naidu: తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన యువ నాయకులకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అందించే ‘యంగ్ గ్లోబల్ లీడర్’ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఈ గౌరవానికి భారతదేశం నుంచి ఏడుగురు ఎంపికవగా, వారిలో రామ్మోహన్ నాయుడు ఒకరు.
ఈ సందర్భంగా రామ్మోహన్ స్పందిస్తూ, “ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నిజాయితీతో, కొత్త ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని ఇది గుర్తు చేస్తోంది” అని అన్నారు. యువత దేశ నిర్మాణంలో కీలకంగా మారుతుండటాన్ని ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుందని తెలిపారు.
Also Read: Sai Reddy Seat: విజయసాయిరెడ్డి ప్లేస్‌లో రాజ్యసభకు ఆ రాయలసీమ రెడ్డి నేత?
రామ్మోహన్ నాయుడు 2014లో 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై యువ నేతగా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రి హోదాలో సేవలు అందిస్తున్నారు. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
Rammohan Naidu: రామ్మోహన్‌కు ఈ గౌరవం లభించినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. “ఇది తెలుగు ప్రజలకే కాకుండా దేశానికీ గర్వకారణం” అన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా రామ్మోహన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తూ, “ఇది యువతకు స్ఫూర్తిదాయకం” అని అభిప్రాయపడ్డారు.