Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ పెట్టుబడిదారుల మద్దతు వంటి అంశాలు మార్కెట్‌కి బలాన్నిచ్చాయి. దీనితో పాటు అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు ఉన్నా కూడా, కొనుగోళ్ల ధోరణి కొనసాగింది.
ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా పెరిగి 78,553 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా దాదాపు 400 పాయింట్ల లాభంతో 23,851 వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ల లాభాల వలన బీఎస్ఈలో నమోదైన కంపెనీల కలిపి మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లకుపైగా పెరిగి రూ.419 లక్షల కోట్లకు చేరింది.
మరోవైపు, రూపాయి విలువ కూడా స్వల్పంగా మారి డాలరుతో 85.35 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ లో దాదాపు అన్ని రంగాల్లో లాభాలే కనిపించాయి. టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ మినహా మిగతా సెన్సెక్స్ షేర్లు పాజిటివ్‌గా ముగిశాయి.
Also Read: Gold Rate Hike: బంగారం భగభగ ! లక్ష దగ్గర లో తులం బంగారం
Stock Market: అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $66 వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర $3,324 వద్ద ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లపై తాత్కాలిక విరామాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో దేశీయ మార్కెట్లలోనూ పెట్టుబడిదారుల విశ్వాసం మరింతగా పెరిగింది. ఈ అన్ని అంశాల మధ్య, గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న నష్టాల నుంచి మార్కెట్లు కోలుకొని తిరిగి బలంగా నిలిచాయి.