Mumbai: ఇకపై రైళ్లలోనూ ఏటీఎమ్‌లు

Mumbai: ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఎటీఎం సేవలను అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. సెంట్రల్ రైల్వే ప్రయోగాత్మకంగా తొలిసారి ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ప్రయాణం నాలుగున్నర గంటలు పడుతుంది. ఆ మార్గంలో ఈ రైలు చాలా కీలకమైందిగా భావిస్తారు. దీంతో ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎమ్‌ను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్‌ను కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే మిగతా రూట్ల రైళ్ళలోనూ ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: విజయమ్మ ఫోన్ ట్యాప్.. ఆడియో విన్న జగన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *