KA Trailer: ‘క’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘క’. ఇన్నాళ్లు లవ్, కమర్షియల్ సినిమాలతో పలకరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు రూటు మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. 1970ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్ సాగే పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ మూవీ వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి దాదాపు రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో “క” మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 24న విడుదల కాబోతున్నట్లు ఇన్స్ స్టాగ్రామ్ వేదికగా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డార్క్ షేడో ఎండిన చెట్ల మధ్యలో అను మానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. కాగా, సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ భాష‌ల్లో విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dil Raju: కిరణ్ హార్డ్ వర్క్ కి ఫలితం ‘క’ విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *