Hyderabad::హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచే నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర వేడితో ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నానికి ఆకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హిమాయత్‌నగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. వర్షం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఆకస్మిక వర్షం ప్రజలపై ప్రభావం చూపింది.
వాతావరణ విభాగం ప్రకారం, వచ్చే రెండు రోజులలో కూడా ఇలాంటి వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

