Tabu: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా గురించి సంచలన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్ నిర్మాణ సారథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి టబూ కీలక పాత్రలో కనిపించనున్నారని తాజా సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, పూరి, ఛార్మితో కలిసి టబూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా కథ విన్న విజయ్ సేతుపతి ఉత్సాహంతో షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. టబూ ఈ చిత్రంలో దృఢమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
