Crime News

Crime News: నర్సీపట్నంలో యువకుడి దారుణ హత్య

Crime News: నూకాలమ్మ పండగ సందర్భంగా డ్యాన్లు ప్రోగ్రామ్స్‌ నిర్వహించారు.. భారీగా యువకులు హాజరై పండగ చేసుకున్నారు.. దీనికి భారీగా మద్యం సేవించి డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌ అంటూ సందడి.. ఇక్కడే యువకుల మధ్య ఘర్షణకు దారి తీసింది.. గొడవలు వద్దని పోలీసులు అక్కడ నుంచి అందరిని వెళ్లమన్నారు. వెళ్లారు కూడా.. ఇదే మొదలైంది అసలు రచ్చ..ఈ రచ్చ కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు..మరో యువకుడుని ఆస్పత్రికి తరలించారు.. ఇంతకీ అక్కడ డ్యాన్స్‌ లో వచ్చిన గొడవకు కారణం ఏంటీ..?

నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన రుత్తల దుర్గాప్రసాద్‌.. గ్రామానికి సమీపంలో వున్న నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని అయ్యన్న కాలనీలో జరుగుతున్న నూకాలమ్మ పండగకు వచ్చాడు. డ్యాన్స్‌ బేబీ డాన్స్‌ ప్రోగ్రామ్‌ జరుగుతున్న స్టేజీ ముందు తన స్నేహితుడైన మాకవరపాలెం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన పైల సాయితో కలిసి డాన్స్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అయ్యన్నకాలనీకి చెందిన చిత్రాడ మహేశ్‌, అతని స్నేహితులు స్టేజీ దగ్గరకు వచ్చి దుర్గాప్రసాద్‌, సాయిలతో గొడవ పడ్డారు.

మద్యం సేవించి వుండడంతో కొట్లాడుకున్నారు. బందోబస్తులో ఉన్న పట్టణ పోలీసులు వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. సాయితో కలిసి దుర్గాప్రసాద్‌ రాత్రి నిద్రించడానికి అయ్యన్న కాలనీలో నివాసం ఉంటున్న తన సోదరుడు రుత్తల బోడకొండ ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత దుర్గాప్రసాద్‌కి మహేశ్‌ ఫోన్‌ చేసి, సాయితో గొడవపడుతుంటే నువ్వెందుకు అడ్డుకున్నావని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

మహేశ్‌ అంతటితో ఆగకుండా దుర్గాప్రసాద్‌ ఉన్న ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేశ్‌ వెంట తెచ్చుకున్న కత్తితో దుర్గాప్రసాద్‌ ఛాతీపై బలంగా పొడిచాడు. ప్రాణభయంతో దుర్గాప్రసాద్‌ మేడ మీదకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. అంతకుముందు తనను అడ్డుకోబోయిన సాయిని కూడా మహేశ్‌ కత్తితో పొట్ట మీద, కాలి తొడ భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

మేడ మీద అపస్మారక స్థితిలో ఉన్న దుర్గా ప్రసాద్‌ను వరుసకు వదిన అయిన మౌనిక ఆస్పత్రికి తరలించే క్రమంలో దారిలో ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన సాయిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అయ్యన్నకాలనీకి వెళ్లారు. పట్టణ సీఐ గోవిందరావు, క్లూస్‌ టీమ్‌ మేడ మీద, ఇంటి ఆవరణలో ఆధారాలు సేకరించారు. నిందితుడు మహేశ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. కాగా దుర్గాప్రసాద్‌ తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఇతనికి తల్లి, చెల్లెలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *