Rajinikanth vs NTR

Rajinikanth vs NTR: రజినీకాంత్ తో పోటీ ఆపనంటున్న ఎన్టీఆర్!

Rajinikanth vs NTR: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే, అదే రోజున బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ‘వార్-2’ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వేడెక్కనుంది. ఇది 2025తో ఆగడం లేదు.. 2026లోనూ ఈ హీరోల మధ్య వార్ కొనసాగనుందట. రజినీ తన నెక్స్ట్ మూవీ ‘జైలర్-2’తో రాబోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కు రజినీ వచ్చే వారం జాయిన్ కానున్నాడు. మరోవైపు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఏప్రిల్ 22 నుంచి నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు 2026 ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాయట. వారం రోజుల గ్యాప్‌లోనే ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ను హీట్ చేయనున్నాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2025, 2026లో రజినీ-ఎన్టీఆర్ మధ్య బిగ్ ఫైట్ తప్పేలా లేదు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *