Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’ సినీ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో పవన్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్రలో కనిపిస్తాడని ఓ రేంజ్‌లో రూమర్లు షికారు చేశాయి. అంతేకాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో కూడా అకీరాకు గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ ఉందని టాక్ జోరందుకుంది.
ఈ హాట్ టాపిక్ మీద రేణూ దేశాయ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. అకీరాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే, అతనే స్వయంగా చెప్పాలి. అప్పుడు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటిస్తా. అంత వరకు ఈ రూమర్లకు బ్రేక్ వేయాలని కోరుకుంటున్నా’ అని రేణూ క్లారిటీ ఇచ్చారు.
Also Read: Jaat Movie: ‘జాట్’ సెన్సార్ కంప్లీట్!
Renu Desai : గతంలో కూడా ఇలాంటి వార్తలను ఆమె ఖండించినా, మళ్లీ వైరల్ కావడంతో ఈ సారి గట్టిగా చెక్ పెట్టారు. అకీరా సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, అకీరా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అధికారిక అప్‌డేట్ కోసం వేచి చూడాల్సిందే! ‘ఓజీ’ సినిమా హైప్‌తో పాటు ఈ రూమర్ డ్రామా కూడా ఫ్యాన్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.