Miss World Pageant: వచ్చే నెలలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ మహానగరం వేదిక కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఈ పోటీల్లో దేశదేశాల నుంచి వనితలు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 రోజులకు పైగా జరిగే ఈ పోటీల సందర్భంగా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయాలపై అధికార వర్గం ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయింది.
Miss World Pageant: హైదరాబాద్‌లో వచ్చే మే నెల 7 నుంచి అదే నెల 31 వరకు 72వ మిల్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొననున్నారు. వారంతా మే నెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్ నగరానికి చేరుకుంటారని నిర్వాహకులు తెలిపారు. వారి కోసం ఇప్పటికే వసతీ ఏర్పాట్లు చేసి ఉంచారు.
Miss World Pageant: వివిధ దేశాల మోడల్స్ రాక సందర్భంగా తొలిరోజు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో వారంరదికీ స్వాగత వేడుకల అనంతరం డిన్నర్ ఉంటుంది. వీటి కోసం తెలంగాణ పర్యాటక శాఖ, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Miss World Pageant: వెల్కమ్ డిన్నర్‌లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖకు ఉన్న ప్రాధాన్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 120 మంది మోడల్స్‌తోపాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.
Miss World Pageant: ఈ కార్యక్రమం ఆరంభం నుంచి ఆఖరు వరకు పర్యాటక రంగ విశిష్టతలను చాటేలా కార్యక్రమాలను రూపొందించేలా ఏర్పాట్లు జరుగతున్నాయి. ప్యాలెస్ లో ఫొటో షూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ పోటీలు, కవాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల పాటు ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.