Telangana Kikku

Telangana Kikku: బీర్లు తగ్గించారు.. ‘హాట్‌’ కుమ్మేశారు!

Telangana Kikku: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరినట్లు తన నివేదికలో తెలిపింది. గత సంవత్సరంలో రూ.34,800 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. గతేడాది రూ.264 కోట్లు వైస్ షాపులకు వచ్చిన అప్లికేషన్లకు నాన్ రీఫండబుల్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ వార్షిక ఏడాదిలో ఆదాయం తగ్గినట్లుగా కనిపిస్తుందని, కానీ ఈ సంవత్సరంలో కేవలం అమ్మకాల ద్వారా ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. బీర్లకు సంబంధించి 3 శాతం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే తగ్గినట్లు వెల్లడించారు. 2023-24 వార్షిక సంవత్సరంలో 548 లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరుగగా 2024-25 వార్షిక ఏడాదిలో 531 లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.

జనవరి నెలలో యూబీ కంపెనీకి చెందిన కింగ్ ఫిషర్ తయారి నిలిపివేయడం, బీర్ల ధరలు స్పలంగా పెరగటంతో బీర్ల అమ్మకాలు తగ్గినట్లుగా టీజీ బీసీఎల్ అధికారులు తెలిపారు. లిక్కరుకు సంబంధించి మాత్రం 2 శాతం పెరుగుదల ఉందని వెల్లడించారు. 2023-24 వార్షిక సంవత్సరంలో 362 లక్షల కాటన్ల లిక్కర్ అమ్మకాలు జరుగగా 2024-25 సంవత్సరంలో 369 లక్షల కాటన్ల అమ్మకాలు జరిగాయి. టాక్స్ రూపంలో రూ.7 వేల కోట్లు సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఆదాయ మార్గాల పెంపు గురించి యోచిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా నిరూపయోగంగా ఉన్న హరిత హోటల్‌లో బార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో సోమవారం మరోసారి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎక్సెజ్ అధికారులు భేటీ అయినట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల ప్రాంతాలలో ఉన్న హరిత హోటల్స్ మినహా రాష్ట్రం అంతటా ఈ ప్రక్రియ చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాగైనా నిరూపయోగంగా ఉండి నష్టాలలో ఉన్న హరిత హోటల్స్ ద్వారా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read: TGSRTC: అస‌లు ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్న‌దేమిటి? వ‌చ్చే నెల‌లో స‌మ్మె త‌ప్ప‌దా?

Telangana Kikku: గతంలో అనివార్య కారణాలతో మూతపడిన 40 వైన్స్ షాప్‌లకు టెండర్లు వేసేందుకు చర్యలు చేపట్టింది సర్కార్‌. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. నూతన మద్యం కంపెనీలను ఆహ్వానిస్తూ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియడంతో ఎంపిక ప్రక్రియపై టీజీబీసీఎల్ కసరత్తు ప్రారంభించింది. 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఎక్సెజ్ ఆదాయ వివరాలు పరిశీలిస్తే… గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆదాయం పెరగలేదన్నట్లుగానే తెలుస్తోంది.

ALSO READ  Macherla Murders: భారీ పథకం ప్రకారమే హత్యలా?

2021-22 వార్షిక సంవత్సరంలో రూ.3500 కోట్లు పెరిగి రూ.30,783 కోట్ల ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.4362 కోట్లు పెరిగి రూ.35,145 కోట్ల ఆదాయం సమకూరింది. గత రెండు సంవత్సరాల కాలంలో ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.345 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా కనిపిస్తుంది. 2024-25 సంవత్సరంలో రూ.200 కోట్ల ఆదాయం తగ్గినట్లుగా తెలుస్తుంది. 2023-24 సమయంలో ఎన్నికల కారణంగా ఆదాయం పెరిగినట్లుగా చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *